మీ బహుమతి.. నన్ను ఏడిపించింది : రష్మిక

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: రష్మిక మందనా&#8230; కన్నడ సినిమా &#8216;కిరాక్ పార్టీ&#8217;తో సినీ రంగ ప్రవేశం చేసింది. &#8216;ఛలో&#8217; సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన భామ&#8230; టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ పొందేందుకు ప్రయత్నిస్తోంది. &#8216;గీతా గోవిందం&#8217;, &#8216;డియర్ కామ్రేడ్&#8217;, &#8216;సరిలేరు నీకెవ్వరు&#8217;, &#8216;భీష్మ&#8217; లాంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక&#8230; ఆదివారం రోజు పుట్టినరోజు ఘనంగా జరుపుకుంది. సోషల్ మీడియా వేదికగా అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానుల శుభాకాంక్షలతో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. అయితే ఓ [&hellip;]</p>

మీ బహుమతి.. నన్ను ఏడిపించింది : రష్మిక
X

దిశ, వెబ్‌డెస్క్: రష్మిక మందనా… కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఛలో’ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన భామ… టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ పొందేందుకు ప్రయత్నిస్తోంది. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ లాంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక… ఆదివారం రోజు పుట్టినరోజు ఘనంగా జరుపుకుంది. సోషల్ మీడియా వేదికగా అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానుల శుభాకాంక్షలతో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. అయితే ఓ ఫ్యాన్ మేడ్ వీడియో తనను భావోద్వేగానికి గురిచేసిందట.

రష్మిక మందన్నా స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు ఓ అభిమాని. ఈ వీడియోను తయారు చేసేందుకు చాలా రోజులు పట్టిందని… దీనికి కారణం మీ మీదున్న ప్రేమ, గౌరవమే కారణమని తెలిపాడు. తొమ్మిది నిమిషాల 36 సెకన్లున్న వీడియోను పూర్తిగా చూడాలని కోరాడు. దీంతో ఈ వీడియోను చూసిన రష్మిక కన్నీరు పెట్టుకుందట. మీరు చూపించిన అభిమానం నన్ను భావోద్వేగానికి గురిచేసిందని… నాకు ఆనందభాష్పాలు వచ్చాయని తెలిపింది. ఇంత విలువైన పుట్టినరోజు కానుక అందించిన మీకు ధన్యవాదాలు అని చెప్పింది. తాజాగా ‘భీష్మ’తో తెలుగులో హిట్ అందుకున్న రష్మిక… ప్రస్తుతం సుకుమార్, బన్నీ కాంబినేషన్ మూవీ చేస్తుంది. అటు కన్నడలో ‘పొగరు’, తమిళ్‌లో ‘సుల్తాన్’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Tags: Rashmika Mandanna, Bheeshma, Tollywood, Fan Made Video

Next Story