నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని లాభాలు (20/04/2023)

by Dishanational2 |
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని లాభాలు  (20/04/2023)
X

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. ఇది ఈరోజు మీ ఆర్థికసమస్యలను తీర్చుతంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆఫీసుల్లో పని చేసేవారు, సహా ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎన్నో గొప్ప అవకాశాలు మీ చేతికి అంది వచ్చినా, మీరు వాటిని అందుకోలేరు. నేడు మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభ రాశి :ఈ రాశి వారు ఉమ్మడి వ్యాపారలలోనూ, ఊహల ఆధారితమైన పథకాలలో పెట్టుబడులు అస్సలే పెట్టకూడదు.ఈరోజు మీరు మీ స్నేహితులు, బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పని చేసే చోట మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. నేడు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా రోజంతా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథున రాశి : ఈరోజు మీరు మీ పిల్లలతో ఎక్కుసేపు గడపడానికి ఆసక్తి కనబరుస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. చాలా కష్టంగా పని చేస్తారు. కానీ శ్రమకు తగిన ఫలితం ఉంటదు. భారీ ఆర్థిక వ్యవహారాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి, అలాగే కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది.మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. నేడు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి : ఈరోజు మీరు అనుకున్న పని చేయడానికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెళ్లిఅయినవారు వారిధనాన్ని వారియొక్క పిల్లల చదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు, వారుండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు.

సింహ రాశి : ఈ రోజు ఈ రాశి వారు తమ లక్ష్యాల వైపు మొగ్గు చూపుతారు. విజయం వైపు అడుగులు వేస్తారు. కానీ విజయం రావావలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మారాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కన్యా రాశి : మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. షాపింగ్ కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.

తుల రాశి : ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఉద్యోగ పరంగా కొంత మేలు జరుగుతుంది. వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి

వృశ్చిక రాశి : ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆఫీసుల్లో సీనయర్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. అది మీకు చాలా చికాకును కలిగిస్తుంటుంది.


ధనస్సు రాశి : మీరు ఇంతమునుపు ఎక్కువఖర్చు పెట్టివుంటే,మీరుఇప్పుడు దానియొక్క పర్యవసానాలను అనుభవిస్తారు.దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఈరోజు ఈరాశిలోని వ్యాపరస్తులు అధికలాభాలు పొందుతారు.

మకర రాశి : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు.ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు.రోజుమొత్తము మీరు దీనివలన విచారానికి గురిఅవుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది.

కుంభ రాశి : తాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్తవహించండి, నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యంపాలు చేయగలదు. ఎవరైతే ధనాన్ని,జూదంలోనూ,బెట్టింగ్లోను పెడతారోవారు ఈరోజు నష్టపోకతప్పదు.కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజు.

మీన రాశి : ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఒకరిద్దరు సన్నిహితులు ఇరకాట పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువులు మీ సహాయ సహకారాలు ఆశిస్తారు. ఆరోగ్యంఅనుకూలి స్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. స్నేహితురాలికి కానుకలు కొనిస్తారు.



Next Story

Most Viewed