ఇటలీలో చైతుతో రాశి.. అది చాలా కష్టమంటున్న భామ!

by  |
ఇటలీలో చైతుతో రాశి.. అది చాలా కష్టమంటున్న భామ!
X

దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘థాంక్ యూ’. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు బీవీఎస్ రవి రచయిత కాగా, ప్రస్తుతం ఇటలీలోని మిలాన్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌కు ప్యాకప్‌ చెప్పేశారు. కాగా ఈ సెట్స్‌లో చైతుతో కలిసి ఉన్న చీర్‌ఫుల్ సెల్ఫీ షేర్ చేసింది రాశి. ఇక సింక్ సౌండ్ సెటప్‌ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫస్ట్ టాలీవుడ్ మూవీ ఇదే కాగా.. ఇలాంటి సెటప్‌లో వర్క్ చేయడం కష్టమని చెప్తోంది రాశి. తొలిసారి ఆడియన్స్‌ తన ఫేస్‌తో పాటు తన వాయిస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయబోతుండటం పట్ల చాలా నర్వస్‌గా, ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది. ప్రస్తుతానికి రాశి ‘అంధాదున్’ మాలీవుడ్ రీమేక్‌తో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది.


Next Story

Most Viewed