అందాల భామకు అదిరిపోయే ఆఫర్!

by  |
అందాల భామకు అదిరిపోయే ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రాశీ ఖన్నా అదిరిపోయే ఆఫర్ అందుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌ ఇండస్ట్రీల్లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. సింగం డైరెక్టర్ హరి దర్శకత్వంలో వస్తున్న మూవీలో ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయిందని టాక్. ఇంతకు ముందు విక్రమ్, హరి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వామి, స్వామి స్క్వేర్’ చిత్రాలు సూపర్ హిట్ కాగా, ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సిద్ధం అవుతున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌కు ముందు సూర్యతో మరో సినిమా చేయాలనుకున్న డైరెక్టర్ హరి.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో విక్రమ్‌తో మూవీ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా రాశీకి ప్లస్ అవుతుండగా.. త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది.

Next Story

Most Viewed