రాశీ ఖన్నా ఎగ్జైటింగ్ జర్నీ

by  |
రాశీ ఖన్నా ఎగ్జైటింగ్ జర్నీ
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ రాశీ ఖన్నా మరో మలయాళం సినిమా ప్రయాణం మొదలుపెట్టింది. బాలీవుడ్ మూవీ ‘అంధాదున్’ మలయాళీ రీమేక్‌‌లో హీరోయిన్‌గా నటిస్తున్న రాశి.. ఈ జర్నీ చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది రాశి. రవి కె.చంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రంలో మమతా మోహన్ దాస్.. టబు హిందీలో చేసిన బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది మూవీ యూనిట్. తెలుగులో టాక్సీవాలాకు సంగీతం అందించిన జాక్స్ బెజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేయనున్నారు. ఉన్ని ముకుందన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

https://twitter.com/RaashiKhanna/status/1354329291333529600?s=20

రాశీ ప్రజెంట్ హిందీ సిరీస్ కూడా చేస్తోంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వస్తున్న సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి కూడా అడుగుపెట్టనున్న భామ.. ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.



Next Story

Most Viewed