రాశి డీగ్లామరస్ లుక్ అందుకేనా?

by  |
రాశి డీగ్లామరస్ లుక్ అందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ రాశి ఖన్నా.. ఈ మధ్య పల్లెటూరి అమ్మాయి లుక్‌లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఈ డీగ్లామరస్ లుక్‌‌లో ఉన్న పిక్‌తో పాటు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది రాశి. విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’లో ఫిమేల్ లీడ్ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయినట్లు చెప్పింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ‘సంగతమీజాన్’ చిత్రంలో ఫస్ట్ టైమ్ సేతుపతితో నటించిన రాశి.. ఈ సినిమాతో మరోసారి తనతో జతకట్టనుంది.

ఢిల్లీ ప్రసాద్ దీన్‌దయాళ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ముందుగా అదితి రావు హైదరిని ఫీమేల్ లీడ్‌గా ఫైనల్ చేసినా, పలు కారణాల వల్ల తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ ప్లేస్‌‌ను కొట్టేసింది రాశి. కాగా ‘తుగ్లక్ దర్బార్’లో మంజిమా మోహన్ సేతుపతి సిస్టర్‌గా కనిపించనుండగా.. నటుడు ఆర్. పార్థిబన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గోవింద్ వసంతన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు.

Next Story

Most Viewed