- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇస్మార్ట్ బైలింగువల్‌లో కన్నడ బ్యూటీ
<p>దిశ, సినిమా : టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో బైలింగువల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. #RAPO19 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ వివరాలు రివీల్ చేస్తున్న మేకర్స్.. తాజాగా కన్నడ బ్యూటీ అక్షర గౌడ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో యాంటగోనిస్ట్‌గా కనిపించబోతున్న ఆది పినిశెట్టికి జంటగా అక్షర కనిపించనుందని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్న అక్షర.. పల్లెటూరి అమ్మాయి […]</p>

దిశ, సినిమా : టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో బైలింగువల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. #RAPO19 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ వివరాలు రివీల్ చేస్తున్న మేకర్స్.. తాజాగా కన్నడ బ్యూటీ అక్షర గౌడ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో యాంటగోనిస్ట్‌గా కనిపించబోతున్న ఆది పినిశెట్టికి జంటగా అక్షర కనిపించనుందని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్న అక్షర.. పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషిస్తోంది.
అంతేకాదు సినిమా తమిళ్ వెర్షన్‌కు మధురై స్లాంగ్, తెలుగు వెర్షన్‌కు కడప యాస మాట్లాడుతుందని తెలుస్తోంది. డైరెక్టర్ లింగుస్వామికి కూడా టాలీవుడ్‌లో ఇదే మొదటి చిత్రం కాగా.. ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ దక్కించుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.






