యువకుడి దారుణం : బాలున్ని కూడా వదల కుండా అక్కడకు తీసుకెళ్లి మరీ

by  |
Minor boys
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుడని చూడకుండా చిన్న పిల్లాడిపై యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువకుడు లైంగికదాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్శీగుట్ట మ‌ధురాన‌గ‌ర్ కాల‌నీకి చెందిన సతీష్ 23 అనే యువ‌కుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో ప‌నిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి సతీష్ బాలుడిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలుడు భయపడి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్‌ తెలిపారు.


Next Story

Most Viewed