- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు..
<p>యూపీలోని బదోహి నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి,ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురిపై బుధవారం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వివాహం పేరుతో త్రిపాఠి మేనల్లుడు తనపై అత్యాచారం చేశాడని తొలుత ఫిర్యాదు చేసిన 40 ఏళ్ల వితంతువు, అనంతరం త్రిపాఠిపై కూడా ఫిర్యాదు చేసింది. వివాహం సాకుతో త్రిపాఠి మేనల్లుడు తనతో శారీరక సంబంధం కొనసాగించాడని, ఆ తర్వాత త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు కూడా 2017లో ఓ హోటల్‌లో బంధించి అత్యాచారం చేశారని ఆమె […]</p>
X
యూపీలోని బదోహి నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి,ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురిపై బుధవారం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వివాహం పేరుతో త్రిపాఠి మేనల్లుడు తనపై అత్యాచారం చేశాడని తొలుత ఫిర్యాదు చేసిన 40 ఏళ్ల వితంతువు, అనంతరం త్రిపాఠిపై కూడా ఫిర్యాదు చేసింది. వివాహం సాకుతో త్రిపాఠి మేనల్లుడు తనతో శారీరక సంబంధం కొనసాగించాడని, ఆ తర్వాత త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు కూడా 2017లో ఓ హోటల్‌లో బంధించి అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీస్ సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ తెలిపారు. వితంతువు గర్భం దాల్చగా బలవంతంగా ఆబార్షన్ చేయించారని కూడా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్టు సూపరింటెండెంట్ తెలిపారు.
Next Story






