- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై అత్యాచార యత్నం
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: బాలికపై అత్యాచారానికి యత్నించిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉండే 16 ఏళ్ల బాలిక ఇంటి పక్కన మహిళతో కలిసి సోమవారం ఉదయం 10.30గంటల సమయంలో టీఎఫ్ఎల్ కంపెనీ సమీపంలో చెత్త ఏరుకునేందుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు యువకులు బాలికను బలవంతంగా బైక్ ఎక్కించుకొని అనురాగ్‌కాలనీలోని చెట్ల పొదల వద్దకు తీసుకెళ్లి […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: బాలికపై అత్యాచారానికి యత్నించిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉండే 16 ఏళ్ల బాలిక ఇంటి పక్కన మహిళతో కలిసి సోమవారం ఉదయం 10.30గంటల సమయంలో టీఎఫ్ఎల్ కంపెనీ సమీపంలో చెత్త ఏరుకునేందుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు యువకులు బాలికను బలవంతంగా బైక్ ఎక్కించుకొని అనురాగ్‌కాలనీలోని చెట్ల పొదల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు బాలికను రక్షించి, యువకులను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితులు అమీన్‌పూర్‌కు చెందిన జానకి రవి, గజ్జల సాయికుమార్‌గా గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






