ఆరేళ్ల బాలికపై వ‌ృద్ధుడు అత్యాచారయత్నం

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఓ వృద్ధుడు. తన ముని మనవరాలి వయస్సు ఉన్న చిన్నారి(6)పై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక బెస్తవారు‌పేట్‌లో చిన్నారి కుటుంబం ఉంటుంది. తల్లి ఇంట్లో లేని సమయంలో చిన్నారి ఆడుకుంటూ ఉండగా, ఇంతలోనే వృద్ధుడు ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో వృద్ధుడు పారిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో చట్టం కింద [&hellip;]</p>

ఆరేళ్ల బాలికపై వ‌ృద్ధుడు అత్యాచారయత్నం
X

దిశ, ఆదిలాబాద్: సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఓ వృద్ధుడు. తన ముని మనవరాలి వయస్సు ఉన్న చిన్నారి(6)పై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక బెస్తవారు‌పేట్‌లో చిన్నారి కుటుంబం ఉంటుంది. తల్లి ఇంట్లో లేని సమయంలో చిన్నారి ఆడుకుంటూ ఉండగా, ఇంతలోనే వృద్ధుడు ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో వృద్ధుడు పారిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story