అత్యాచార నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య..

111
police

దిశ, కాజీపేట: చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి పాశవికంగా హత్యచేసిన నిందితుడు రాజు గురువారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జిఆర్పి ఎస్పి అనురాధ తెలిపారు- కాజీపేటలోని జి ఆర్ పి స్టేషన్లో గురువారం రాత్రి విలేకరుల సమావేశం నీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తి నస్కల్ స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తమ సిబ్బందికి సమాచారం వచ్చిందన్నారు. సమాచారం అందుకున్న తమ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రాజుగా గుర్తించి పై అధికారులకు సమాచారాన్ని అందజేశారని పేర్కొన్నారు.

సంఘటన స్థలంలో మృతుని వద్ద సిమ్ము లేని రెండు సెల్ఫోన్లు దొరికినట్ల తెలిపారు. రాజు ఆత్మహత్య చేసుకుంటేగా చూసిన ప్రత్యక్ష సాక్షులను లోకో పైలెట్ లను కిమెన్ ను విచారించి సమాచారాన్ని సేకరించామని అన్నారు. కేసు నమోదు చేసే మృతదేహాన్ని ఎంజీఎం తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ మల్లారెడ్డి రామ్మూర్తి సిఐ రామ్మూర్తి ఎస్ ఐ అశోక్ కుమార్ లు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..