ఇంటర్వ్యూలో ఏడ్చేసిన స్టార్ హీరో.. కన్నీరు తుడుచుకుంటూనే..

by  |
ranveer
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నాడు. రీసెంట్‌గా రిలీజైన తన ‘83’ పిక్చర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో ఆనందభాష్పాలు రాల్చాడు. హిందీ చానల్‌తో వర్చువల్ ఇంటరాక్షన్‌లో భాగంగా భావోద్వేగానికి లోనైన రణ్‌వీర్.. ‘83’ విడుదల తర్వాత వస్తున్న అప్రిసియేషన్ కాల్స్, మెసేజ్‌లతో తన సెల్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోతుందని, రోజుకు మూడుసార్లు చార్జింగ్ పెట్టాల్సి వస్తోందని తెలిపాడు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమ పొందడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆయన.. తాను నటుడిగా మారడాన్ని ఓ అద్భుతంగా అభివర్ణించాడు. ‘ఇది మరో లెవల్. ఇది ఎల్లప్పుడూ జరగదని నాకు తెలుసు’ అని తెలిపాడు.

Next Story

Most Viewed