కోహ్లీ స్ట్రైక్‌‌రేట్‌పై ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు -కామెంటేటర్ సైమన్ డౌల్

by Shamantha N |
కోహ్లీ స్ట్రైక్‌‌రేట్‌పై ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు -కామెంటేటర్ సైమన్ డౌల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల కాలంలో అభిమానం హద్దులు మీరుతోంది. తాము అభిమానించే వ్యక్తిని ఎవరైనా విమర్శించినా, ప్రశ్నించినా కొందరు ఎదుటి వ్యక్తులను ట్రోల్ చేయడం, విమర్శించడంతో పాటు ఏకంగా చంపేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు.భారత్‌లో ఈ కల్చర్ ఇటీవల మితిమీరిపోతోంది. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్‌ వ్యవహరిస్తున్న సైమన్ డౌల్‌కు చేదు అనుభవం ఎదురైంది.

2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ తరఫున ఆడిన విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నించి నందుకు గాను తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సైమన్ చెప్పారు. గతంలో విరాట్ కోహ్లీకి పాజిటివ్‌గా చాలా చెప్పానని, కానీ ఒక్కసారి అతనికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇలా బెదిరించడం సరికాదని.. నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని డౌల్ అసహనం వ్యక్తంచేశారు. కాగా, ఈ ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 154.70గా ఉంది.

Next Story