సింగపూర్ ఓపెన్‌.. 2వ రౌండ్‌కు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్

by Shamantha N |
సింగపూర్ ఓపెన్‌.. 2వ రౌండ్‌కు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్
X

దిశ, స్పోర్ట్స్ : సింగ్ పూర్ ఓపెన్‌లో భారత షట్లర్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ముఖ్యంగా భారత స్టార్ మహిళా షట్లర్ పీవీ సింధు బుధవారం జరిగిన టోర్నీలో డెన్మార్క్‌కు చెందిన హొజ్మార్సక్ జేర్స్‌ఫెల్ట్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.ఇక రెండో రౌండ్‌లో సింధు స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా, పీవీ సింధు ఇటీవల ముగిసిన మలేషియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, పారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సింధు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రణయ్ సైతం..

సింగపూర్ ఓపెన్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ సైతం తొలి రౌండ్‌లో బెల్జియం షట్లర్ జులైన్ కారాగిపై విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.తన తదుపరి గేమ్‌ను కెంటా నిషిమోటో‌తో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడాల్సి ఉంటుంది.ఇకపోతే భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది. మహిళల డబుల్స్ విషయానికొస్తే త్రిసా, గాయత్రి జోడి తొలి రౌండ్లో విజయం సాధించగా, తనీషా, అశ్విని జోడీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Next Story