రణ్‌వీర్ యోజింబో హెయిర్‌స్టైల్.. బై దీపిక

by  |
రణ్‌వీర్ యోజింబో హెయిర్‌స్టైల్.. బై దీపిక
X

దీప్ వీర్.. బాలీవుడ్ క్యూటెస్ట్ అండ్ స్వీటెస్ట్ కపుల్. తమ మధ్య ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోని ఈ జంట.. ఇంటర్వ్యూస్, అవార్డు ఫంక్షన్స్, మీడియా ఇలా ఎక్కడైనా సరే.. చాలా అన్యోన్యంగా కనిపిస్తుంటారు. దీపికను తన భార్యగా పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు రణ్‌వీర్ చాలాసార్లు చెప్పాడు కూడా. లాక్‌డౌన్ సమయంలో భర్తకు ఇష్టమైన వంట చేయడమే కాక, దగ్గరుండి మరీ తినిపించిన దీపిక కొత్తగా.. రణ్‌వీర్‌కు డిఫరెంట్ హెయిర్ స్టైల్ సెట్ చేసింది.

ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రామ్‌లీలా హీరో.. తనకు చాలా బాగా నచ్చిందని చెప్పాడు. జపనీస్ యాక్టర్ తోషిరో మిఫున్ 1961లో వచ్చిన యోజింబో సినిమాలో ఇదే స్టైల్ ఫాలో కాగా, ‘చాలా చాలా బాగుందని.. మీకు నచ్చిందా’ అంటూ అభిమానులను అడుగుతున్నాడు.

కాగా రణ్ వీర్, దీపికా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘83’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సూర్యవంశీ చిత్రంలోనూ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న రణ్‌వీర్.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’, కరణ్ జోహార్ ‘తక్త్’ చిత్రాల్లో నటించబోతున్నాడు.

Next Story

Most Viewed