నేను ఆరాధించే నటుల్లో ఆయన ఒకరు : రణ్‌వీర్

by  |
నేను ఆరాధించే నటుల్లో ఆయన ఒకరు : రణ్‌వీర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, సీనియర్ హీరో అనిల్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దిల్ దడఖ్ నే దో’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి మళ్లీ వర్క్ చేయడం విశేషం. అయితే ఈసారి సినిమాలో కాదు.. ఓ బ్రాండ్ ప్రమోషన్ షూటింగ్‌ కోసం కొలాబరేట్ అయ్యారు. ‘మ్యాన్ కైండ్’ ఫార్మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఎన్నికైన ఈ స్టార్స్.. ఆ కంపెనీకి చెందిన కొత్త బ్రాండ్ ‘హెల్త్‌ఓకే(Health OK)’ ప్రమోషన్‌లో భాగంగా యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిల్ కపూర్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి రణ్‌వీర్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు. తాను స్క్రీన్‌పై ఎంతో గొప్పగా ఆరాధించే అనిల్ కపూర్‌తో ‘దిల్ దడఖ్ నే దో’ చిత్రం తర్వాత మళ్లీ కలిసి పని చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఆయనొక లెజెండరీ ఆర్టిస్ట్‌, హిందీ సినిమా ఫెటర్నిటీలోనే ఫైనెస్ట్ యాక్టర్ అని కొనియాడారు. అంతేకాదు అనిల్ కపూర్‌కు తానెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘83’ పాటు ధర్మ ప్రొడక్షన్స్‌లో ‘సర్కస్’ మూవీలో నటిస్తున్నాడు.



Next Story

Most Viewed