ఇస్మార్ట్ శంకర్‌గా రణ్‌వీర్?

by  |
ఇస్మార్ట్ శంకర్‌గా రణ్‌వీర్?
X

దిశ, వెబ్‌డెస్క్:
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. అప్పటిదాకా ఫెయిల్యూర్స్‌లో ఉన్న వీరిద్దరినీ హిట్ ట్రాక్ ఎక్కించిన బ్లాక్ బస్టర్ మాస్ ఎంటర్‌టైన్మెంట్ ఇదే. నభా నటేష్, నిధి అగర్వాల్‌కు ఇస్మార్ట్ హీరోయిన్ ట్యాగ్ ఇచ్చి.. టాలీవుడ్‌లో స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన సినిమా కూడా ఇదే. అయితే, రామ్‌ను మాస్ యాంగిల్‌లో మరో లెవల్‌లో చూపించిన ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్.

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకోగా.. ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను హీరోగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్‌తో సరితూగాలంటే అంతే ఎనర్జీ కలిగిన రణ్‌వీర్ అయితేనే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారట ఫిల్మ్ మేకర్స్. త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉండగా.. ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌పై ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్. రణ్‌వీర్ సింగ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ లెవల్‌ను రీచ్ అవుతుందని ఆశిస్తున్నారు.

అయితే రామ్ ‘ది గార్నియర్ మెన్’ యాడ్ రిలీజ్ అయ్యాక.. ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ రీమేక్‌లోనూ తననే హీరోగా తీసుకుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed