ఏసీబీ వలలో రంగాపూర్ గ్రామ కార్యదర్శి

by Sridhar Babu |   (  Updated:2021-11-30 07:35:02  IST  )

<p>దిశ, అచ్చంపేట: ప్రజల నుండి ఎలాంటి లంచాలు ఆశించకుండా ఉద్యోగ ధర్మాన్ని కొనసాగించాలని అందరికీ తెలిసినప్పటికీ ప్రజలను పట్టి పీడిస్తూ లంచం ఇస్తేనే పనులు సాఫీగా జరుగుతాయని భీష్మించుకుని కూర్చునే అధికారులు కొందరు ఉంటారు. అలాంటి కోవకే చెందిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వైనం నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అమ్మ [&hellip;]</p>

acb-net1
X

దిశ, అచ్చంపేట: ప్రజల నుండి ఎలాంటి లంచాలు ఆశించకుండా ఉద్యోగ ధర్మాన్ని కొనసాగించాలని అందరికీ తెలిసినప్పటికీ ప్రజలను పట్టి పీడిస్తూ లంచం ఇస్తేనే పనులు సాఫీగా జరుగుతాయని భీష్మించుకుని కూర్చునే అధికారులు కొందరు ఉంటారు. అలాంటి కోవకే చెందిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వైనం నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అమ్మ పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదకు మార్చాలని గ్రామ పంచాయితీ కార్యదర్శి చింతల రామస్వామిని కలిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి రాము నుండి రూ. 6 వేలు డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. అయితే పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. రూ. 5500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం కార్యదర్శిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story