నితిన్ బర్త్ డే గిఫ్ట్… 'రంగ్ దే' ఫస్ట్ లుక్

by  |
నితిన్ బర్త్ డే గిఫ్ట్… రంగ్ దే ఫస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో నితిన్ సోమవారం 30వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది ‘రంగ్ దే’ మూవీ యూనిట్. ఆ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి… నితిన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. మూవీలో నితిన్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా… అను, అర్జున్‌లుగా ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకున్నారు. జంటగా సిల్వర్ స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయబోతున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘రంగ్ దే’ సినిమాకు… ‘గివ్ మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి .. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భీష్మతో లేటెస్ట్ హిట్ అందుకున్న నితిన్…. కరోనా వ్యాప్తి కారణంగా తన పుట్టినరోజు వేడుకలను జరపరాదని .. అభిమానులంతా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చాడు.

Tags: Nithin, Keerthi Suresh, Rang De, First Look, Motion Poster


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed