అదిరిన నితిన్ ‘రంగ్‌దే’

by  |
అదిరిన నితిన్ ‘రంగ్‌దే’
X

ఇటీవలే భీష్మ సినిమా విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్నారు యువ హీరో నితిన్‌. వరుస పరాజయాల తరువాత ఇటీవల వచ్చిన భీష్మతో హిట్ దుకున్నాడు. దీంతో ఆయన ఈ చిత్రం తర్వాత ఆయన మహానటి కీర్తి సురేశ్‌తో కలిసి రంగదే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. కాగా నితిన్ పుట్టిన రోజు సందర్భంగా రంగ్‌‌దే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు మంచి రేటుకు అమ్ముడుపోయాయి. భీష్మ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 10కోట్లని సమాచారం. ఈ చిత్రం జూలైలో విడుదలకానుంది.

Tags: rang de, cinema, digital rights, good rate, nithin, keerthy suresh



Next Story

Most Viewed