రాధే‌లో రణ్‌దీప్ రఫ్ క్యారెక్టర్

by  |
రాధే‌లో రణ్‌దీప్ రఫ్ క్యారెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ‘రాధే : ద మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. హాట్ బ్యూటీ దిశా పఠాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రణ్‌దీప్ హుడా మెయిన్ విలన్‌ రోల్ ప్లే చేస్తుండగా.. తన పాత్ర గురించి బీటౌన్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రణ్‌దీప్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని రఫ్ క్యారెక్టర్‌లో డిఫరెంట్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన డ్రగ్ లార్డ్‌గా నటిస్తున్న తను సైకోయిస్ట్ గ్యాంగ్ స్టర్‌గా విలనిజం ప్రదర్శించనున్నాడు.

కాగా ఈ పాత్ర గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు రణ్‌దీప్. ఇప్పటి వరకు హీరోగా కనిపించిన తను .. ఇప్పుడు విలన్‌గా నటించడాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని వెయిట్ చేస్తున్నాడు. ముందుగా విలన్ క్యారెక్టర్ ఇమేజ్ మైండ్‌లో సెట్ చేసుకున్నానని.. అదే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయిందని తెలిపాడు. ఇలాంటి పాత్రల్లో నటించేటప్పుడు ఫిజికల్ చేంజెస్ కన్నా మైండ్ సెట్ చేంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. కాగా సినిమాలో రణ్‌దీప్, సల్మాన్ మధ్య కొరియన్ స్టంట్ మాస్టర్ డిజైన్ చేసిన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయట.



Next Story

Most Viewed