- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణ్‌బీర్ ఖాతాలో మరో హీరోయిన్ బలి.. ఇదిగో సాక్ష్యమంటున్న నెటిజన్స్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ జంట ఒక ఫంక్షన్‌కు హాజరవగా, అక్కడ రణ్‌బీర్ చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. విషయానికొస్తే.. తాము కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుతూ ముంబైలోని సర్బోజనిన్ దుర్గా పూజ సమితిలోని కాళీ మాతను సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్‌లో సందడి చేసిన […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ జంట ఒక ఫంక్షన్‌కు హాజరవగా, అక్కడ రణ్‌బీర్ చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. విషయానికొస్తే.. తాము కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుతూ ముంబైలోని సర్బోజనిన్ దుర్గా పూజ సమితిలోని కాళీ మాతను సందర్శించారు.
ఈ సందర్భంగా మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్‌లో సందడి చేసిన ఈ బీటౌన్ జోడీ.. పూజ ముగించుకుని స్టేజ్‌పై నుంచి కిందకు దిగుతుండగా ఆలియా లెహంగా చున్నీ కిందపడింది. అయితే వెనకే వస్తున్న హీరో ఆ చున్నీని కాలితో పక్కకు జరపడం కెమెరా కంటికి చిక్కింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ప్రవర్తనపై మండిపడుతున్నారు. రణ్‌బీర్‌కు పొగరు ఎక్కువని, అసలు ఆలియాపై తనకు ప్రేమే లేదని కామెంట్స్ చేస్తుండటంతో పాటు చాలా స్వార్థపరుడని విమర్శిస్తున్నారు.






