ఇంట్రెస్టింగ్ ‘కామ్రేడ్ రవన్న’ ఫస్ట్ గ్లింప్స్

by  |
ఇంట్రెస్టింగ్ ‘కామ్రేడ్ రవన్న’ ఫస్ట్ గ్లింప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో వస్తున్న రానా, సాయిపల్లవి రెవల్యుషనరీ లవ్ స్టోరీ ‘విరాట పర్వం’. సోమవారం రానా బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తు్న్న పాత్ర డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న ఫస్ట్ గ్లింప్స్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో ఏకే 47 పట్టుకుని గంభీరంగా నడుస్తున్న రానా లుక్ ఆకట్టుకుంటోండగా, గ్లింప్స్ మూవీపై అంచనాలను మరింత పెంచేలా ఉంది.

ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం ‘అతని’ది..సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం ‘అతని’ది..ఆ అతను ఎవరంటే డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న అంటూ ఫస్ట్ గ్లింప్స్‌లో రివీల్ చేశారు. రవన్న రోల్‌లో రానా యంగ్ లుక్‌తో పాటు నక్సల్ డ్రెస్‌లో ఏకే 47 పట్టుకుని పోరాడుతున్న దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అడవుల్లో ఉంటూ..ప్రజల కోసం పోరాడే నాయకుడిగా, దోపిడీని ప్రశ్నించే హీరోగా రానా పాత్ర ఉంటుందని ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ‘ఇదేమీ ఇదేమీ రాజ్యం..దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం’ అంటూ రానా, నవీన్ చంద్ర ఇతర నక్సల్ పాత్రధారులు నినాదాలు చేయడం చివర్లో గమనించొచ్చు. సాయిపల్లవి, నందితా దాస్, ప్రియమణి, సాయిచంద్ ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Next Story

Most Viewed