పవర్ స్టార్‌తో భల్లాలదేవుడు ఢీ

by  |
పవర్ స్టార్‌తో భల్లాలదేవుడు ఢీ
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ దసరా రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఒరిజినల్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ మెయిన్ రోల్స్ చేయగా.. తెలుగులో పవన్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోయే మరో హీరో ఎవరనే విషయపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. టాలీవుడ్ హంక్ రానా, పవన్ వీరాభిమాని నితిన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆ లిస్టులో ఉండగా, పవన్‌ను ఢీకొట్టే నటుడిపై తాజాగా మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు.

పవర్‌ఫుల్ పవర్‌స్టార్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించేది మైటీ భల్లాలదేవ రానా దగ్గుబాటి అని ఫిల్మ్ మేకర్స్ ప్రకటించగా, మాచో మ్యాన్ రానా దీనిసై సంతోషం వ్యక్తం చేశాడు. ‘మరో ప్రయాణం మొదలైంది. పరిశ్రమకు చెందిన ఎంతోమంది స్టార్లతో పనిచేయడం ఎంతో జాయ్‌ఫుల్‌గా ఉంది. ఇక కూలెస్ట్ మ్యాన్ పవర్‌స్టార్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఉంది’ అని రానా ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా న‌టించ‌నున్నాడు.


Next Story