వన్ డే సోల్జర్‌గా రానా ‘మిషన్ ఫ్రంట్‌లైన్’

by  |
వన్ డే సోల్జర్‌గా రానా ‘మిషన్ ఫ్రంట్‌లైన్’
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో రానా దగ్గుబాటి ‘మిషన్ ఫ్రంట్ లైన్’ ప్రోమో అదిరిపోయింది. భారత సైనికుల జీవన శైలిని మన కళ్ల ముందు ఆవిష్కరించబోయే ప్రోగ్రామ్‌ను ఇండియన్ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇండియన్ సోల్జర్స్ దేశం కోసం పడే శ్రమ, త్యాగాలను తెలుపుతూ డిజైన్ చేసిన ప్రోమో ఆకట్టుకోగా..రానా అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేశారు.

సాధారణ వ్యక్తి అయిన రానా.. ఒక్కరోజు బి‌ఎస్‌ఎఫ్ సైనికుడిగా జీవించే మిషన్‌లో జాయిన్ కాగా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉండటం అనేది అంత ఈజీ కాదని చెప్తున్నాడు. అక్కడ కూర్చుని ఫైరింగ్ నేర్చుకోవడం విలువైనదిగా భావిస్తున్నట్లు తెలిపిన రానా..ఇంతకు ముందెప్పుడూ ట్రై చేయని మిషన్‌ను, ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని జీవితాన్ని జీవించేశానని.. బి‌ఎస్‌ఎఫ్ జవాన్‌లా ఒక్కరోజు బతకడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయమని చెప్పాడు. అలాంటి గొప్ప వ్యక్తులతో గడిపే అవకాశం దొరకడం గర్వంగా భావిస్తున్నానని తెలిపాడు.

ఈ రియల్ హీరోలతో కఠినమైన శారీరక శిక్షణ పొందడాన్ని అమూల్యంగా భావిస్తున్నట్లు తెలిపిన రానా.. జనవరి 21న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కాబోతున్న ‘మిషన్ ఫ్రంట్ లైన్’ను తప్పక చూడాలని కోరారు. ప్రోమో‌పై బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. దేశం కోసం ప్రతీ క్షణం సవాళ్ల నడుమ జీవిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు..రానా ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు.



Next Story

Most Viewed