హాలీవుడ్ సిరీస్ చేస్తున్న రానా?

by  |
హాలీవుడ్ సిరీస్ చేస్తున్న రానా?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ ఆడియన్స్‌ను ఓటీటీకి అట్రాక్ట్ అయ్యేలా చేసిందనడంలో సందేహం లేదు. అరచేతిలోనే ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉండటంతో థియేటర్లకు వెళ్లే పనిలేకుండా పోయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు, హీరోయిన్లు డిజిటల్ బాట పట్టగా.. తాజాగా దగ్గుబాటి వారసుడు రానా కూడా వెబ్ సిరీస్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే రానా 2017లో వచ్చిన సిరీస్ ‘సోషల్‌’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేయగా.. లేటెస్ట్‌గా మరో సిరీస్‌కు సైన్ చేశాడని టాక్. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా హాలీవుడ్ సిరీస్ ‘రే డొనొవన్‌’ను ఇండియాలో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తుండగా.. నేషన్ వైడ్‌గా పేరున్న యాక్టర్ కోసం ట్రై చేసింది. రానా పాన్ ఇండియా స్టార్ కావడం, నెట్‌ఫ్లిక్స్ రిక్వైర్‌మెంట్స్‌ను ఫుల్‌ఫిల్ చేసే నటుడు కావడంతో తనను ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా ఈ క్రైమ్ డ్రామాపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.

Next Story

Most Viewed