బిగ్ బాస్ హోస్ట్‌గా దగ్గుబాటి వారసుడు

by  |
Daggubati Rana
X

దిశ, సినిమా: తెలుగు ‘బిగ్ బాస్’ నాలుగు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఎన్టీఆర్, నాని, నాగార్జున ముగ్గురు హోస్ట్‌గా అదరగొట్టేశారు. ఇక ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి ఏ స్టార్‌సెలబ్రిటీ హోస్టింగ్ బాధ్యతల్లో కనిపిస్తారనేది చర్చనీయాంశమైంది. గతేడాది నాగ్ అందుబాటులో లేని సమయంలో సమంత హోస్ట్‌గా కనిపించి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకోగా తననే ఈ సీజన్‌కు రిపీట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇందుకు మరో స్టార్ హీరోను ఎంచుకున్నారని టాక్. ‘నంబర్ 1 యారీ’ షోతో యాంకర్‌గా బెస్ట్ అనిపించుకున్న దగ్గుబాటి వారసుడు రానాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. తన యాంకరింగ్ స్కిల్స్‌తో యూత్‌ అటెన్షన్ క్యాచ్ చేసిన తనను తీసుకుంటే టీఆర్పీ కూడా అదిరిపోతుందనే ఆలోచనలో మా టీవీ యాజమాన్యం ఉందని సమాచారం.

Next Story

Most Viewed