బాహుబలి చాలెంజ్‌ను స్వీకరించిన భల్లా!

by  |
బాహుబలి చాలెంజ్‌ను స్వీకరించిన భల్లా!
X

బాహుబలి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన భల్లాల దేవ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటిన రానా.. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ‘హరా హై తో భరా హై’ చాలెంజ్‌కు నామినేట్ చేసిన ప్రభాస్, శ్రుతికి థాంక్స్ చెప్పాడు.

రెండు మొక్కలు నాటిన రానా.. ఒకటి ఆదిపురుష్ ప్రభాస్‌కు, మరొకటి రాక్ స్టార్ శ్రుతి హాసన్‌కు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. తనను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న అభిమానులందరినీ ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. మొక్కలు నాటిన ఫొటోను పోస్ట్ చేస్తూ తనను ట్యాగ్ చేస్తే తప్పకుండా రీట్వీట్ ఉంటుందని చెప్పాడు.

కాగా, ఇన్నాళ్లు పెళ్లి పనులతో బిజీగా ఉండి.. ఇప్పుడు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న రానాను అభినందించారు నెటిజన్లు. ప్రభాస్ ఆదిపురుష్‌‌లో రాముడిగా నటించబోతున్నారు కాబట్టి రావణుడి పాత్ర రానా చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed