తెలంగాణలో రేపే రంజాన్ నెల ప్రారంభం

by  |
తెలంగాణలో రేపే రంజాన్ నెల ప్రారంభం
X

దిశ, న్యూస్ బ్యూరో:

రంజాన్ మాసం ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ నెల 23న సాయంత్రం నెలవంక కనిపించడంతో మరుసటి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నట్టు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించాయి. ఈ రెండు దేశాలతో పాటు కతార్, ఇండోనేషియా, సిరియా, లెబనాన్, మొరాకో తదితర దేశాల్లోనూ శుక్రవారం నుంచే రంజాన్ మాసం ప్రారంభమవుతోంది. కేరళలోని కోజికోడ్‌లోనూ నెలవంక కనిపించడంతో ఆ రాష్ట్రంతో పాటు కర్నాటకలో కూడా రంజాన్ మాసం 24 నుంచే మొదలవుతోంది. తెలంగాణలో మాత్రం 25వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

ఈసారి కరోనా కారణంగా వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు లేనందున రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఇళ్ళల్లోనే జరగనున్నాయి. వచ్చే నెల 23వ తేదీన జరగనున్న రంజాన్ పండుగ నాటికి ఆంక్షల్లో సడలింపు ఉంటే మసీదుల్లో ప్రార్థనలు జరిగే అవకాశం ఉంది, లేదంటే ఇళ్ళల్లోనే జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే ఇఫ్తార్ విందుతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇచ్చే ఇఫ్తార్ విందులు సైతం ఈసారి అనుమానమే.

Tags: Ramzan, Telangana, Corona, Masjid, Mosque



Next Story

Most Viewed