పోలీసుల్ని కలసిన రమ్య కుటుంబం.. గౌతం సవాంగ్ ఏమన్నారంటే ?

by  |
dgp-goutham
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయంలో గౌతం సవాంగ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముద్దాయి శశికృష్ణను ఘటన జరిగిన కొన్నిగంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని రమ్య కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులు వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్రంగా బాధించిందన్నారు. ఆ నిందలు చూస్తుంటే కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

రమ్య కుటుంబంపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: డీజీపీ గౌతం సవాంగ్
బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు డీజీపీ గౌతం సవాంగ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసు దర్యాప్తును పోలీసులు వేగంగా పూర్తి చేశారని రమ్య కుటుంబ సభ్యులు చెప్పారని తెలిపారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. వాళ్ల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కోర్టులో ట్రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. మహిళ భద్రత, రక్షణకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్నివిధాలుగా రమ్య కుటుంబానికి సహాయసహకారాలు అందిస్తుందని డీజీపీ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed