రామ్మోహన్ నాయుడు కరోనా విరాళం 70 లక్షలు

by Vemula.Srinu Prasad |

<p>కరోనా నిర్మూలనకు దేశం మొత్తం నడుం బిగిస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు కరోనా సాయానికి ముందుకు రాగా.. ఆ తరువాత నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళమిచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది. నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తన విరాళం ప్రకటించగా.. తాజాగా టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కరోనా నిర్మూలనకు విరాళం ప్రకటించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి [&hellip;]</p>

rammohan naidu
X

కరోనా నిర్మూలనకు దేశం మొత్తం నడుం బిగిస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు కరోనా సాయానికి ముందుకు రాగా.. ఆ తరువాత నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళమిచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది. నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తన విరాళం ప్రకటించగా.. తాజాగా టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కరోనా నిర్మూలనకు విరాళం ప్రకటించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కరోనా నిర్మూలన కోసం 70 లక్షల రూపాయలు విరాళమివ్వనున్నట్టు ప్రకటించారు.

అంతటితో ఊరుకోకుండా శ్రీకాకుళం జిల్లాలో కరోనా నియంత్రణకు తన నెల జీతం విరాళంగా ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు. మూడు వారాల లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలకు ప్రత్యేక ఆర్థికనిధి కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులను కూడా ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Tags: rammohan naidu, tdp, tdp mp, srikakulam, corona virus, covid-19

Next Story