వర్మకు షాకిచ్చిన అభిమాని.. ఫస్ట్‌ టైమ్ చచ్చిపోయినట్లు ఉందంటున్న ఆర్జీవీ..

by  |
వర్మకు షాకిచ్చిన అభిమాని.. ఫస్ట్‌ టైమ్ చచ్చిపోయినట్లు ఉందంటున్న ఆర్జీవీ..
X

దిశ, సినిమా: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే స్టార్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వ‌ర్మకు ఓ అభిమాని షాక్‌ ఇచ్చాడు. దీంతో తనకు చనిపోయినట్లుందని ట్వీట్ చేసిన వర్మ.. ఇందుకు సంబంధించిన స్టోరీని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో ఓ కుటుంబ సభ్యులంతా వర్మ అభిమానులే. అయితే వర్మపై తమ అభిమానాన్ని చాటుకోవడానికి వినూత్న ప్రయత్నం చేసిన ఈ ఫ్యామిలీ.. ఆయ‌న పేరుతో ‘ఆర్జీవీ హోట‌ల్’ ఓపెన్ చేసింది. అంతేకాదు హోటల్ నిండా ఆర్జీవీ సూక్తులతో కూడిన పోస్టర్లు అంటించారు.

దీంతో అక్కడకు వచ్చిన కస్టమర్లు వాటిని చదివి దైవ వాక్కుల్లా ఉన్నాయని చెబుతున్నారన్న కుటుంబం.. త్వరలో విజయవాడ, విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లో మరిన్ని బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తామని చెప్పారు. అయితే ఆ హోట‌ల్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ.. ‘నా పేరుతో హోట‌ల్ ఉంది. నిజంగా ఇప్పుడు నేను చ‌చ్చిపోయినట్లు అనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చాడు.

Read More : ఐదోసారి జతకట్టనున్న స్టార్ జోడి.. ఫ్యాన్స్‌కు పండగే



Next Story