కొత్త అమ్మాయిపై మీడియా ఫోకస్.. హాట్ కామెంట్స్ చేసిన వర్మ

by  |
RGV
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై ఆయన తనదైన స్టైల్లో స్పందిస్తూ… దానికి వివరణ ఇస్తుంటాడు. అంతే కాకుండా వర్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇక తాను సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా అది సంచలనమే అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి సలహా ఇవ్వనా అంటూ ఆర్.ఆర్. ఆర్. మూవీ, కరోనా వ్యాక్సిన్ గురించి ట్వీట్ చేసిన వర్మ తాజాగా మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ప్రపంచానికి ఒమిక్రాన్ గుబులు పట్టుకుంది. దీంతో దీనిపై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పట్టణంలో ఒమిక్రాన్ వేరియంట్ కొత్త అమ్మాయి.. కానీ నిజమైన ప్రమాదం పాత అమ్మాయి డెల్టా అంటూ ట్వీట్ చేశారు. ముంబైలో ఒక రోజులో దాదాపు 1000 డెల్టా కేసులు నమోదయ్యాయి. అసలైన ప్రమాదం డెల్టా పాత అమ్మాయినే, కానీ మీడియా మాత్రం కొత్త అమ్మాయి ఒమిక్రాన్ పై ఫోకస్ చేస్తుంది అంటూ వర్మ ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు మీడియా కొత్త అమ్మాయిపై ఆసక్తి చూపుతోంది అంటూ కామెంట్స్ చేశారు.

గోవా టూర్‌లో సామ్ బికినీలో దర్శనం.. కొంచెం స్వర్గం అంటూ క్యాప్షన్

Next Story

Most Viewed