టీమ్ ఇండియా మహిళా జట్టు హెడ్ కోచ్‌గా పవార్

50

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా జట్టు హెడ్ కోచ్‌గా రమేష్ పవార్‌ను నియమించినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోచ్ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 35 మంది ఆసక్తి కనబరిచారు. వీరిలో ప్రస్తుత కోచ్ డబ్ల్యూవీ రామన్, రమేష్ పవార్, అజయ్ రాత్రా, రిషికేష్ కనిక్కర్, మమత మబేన్, దేవికా వైద్య, హేమలత కళ, ప్రస్తుత అసిస్టెంట్ కోచ్ సుమ శర్మ షార్ట్ లిస్ట్ అయ్యారు. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ సభ్యులైన సులక్షణ నాయక్, మదన్ లాల్, ఆర్పీసింగ్‌లు బుధవారం వీరందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం రమేష్ పవార్‌ను హెడ్ కోచ్‌గా నియమించాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు బీసీసీఐ అతడిని హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. కాగా, రమేష్ పవార్ గతంలో 2018 జులై నుంచి నవంబర్ వరకు 5 నెలల పాటు కోచ్‌గా పని చేశారు. కానీ అప్పటి జట్టు కెప్టెన్ మిధాలీ రాజ్‌తో విభేదాల కారణంగా బయటకు వెళ్లిపోయారు. టీమ్ ఇండియా తరపున రమేష్ పవార్ 2 టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. అంతే కాకుండా నేషనల్ క్రికెటర్ అకాడమీలో బౌలింగ్ కోచ్‌గా పని చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..