రామ్‌చరణ్ రొమాంటిక్ సాంగ్ లీక్.. ఆర్ఆర్ఆర్? ఆచార్య?

by  |
ramcharan - pooja hegde acharya poster
X

దిశ, సినిమా : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల(ఆచార్య, ఆర్ఆర్ఆర్) షూటింగ్స్ తుది దశకు చేరుకున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనుండగా, ఆయనకు జోడీగా ‘సీత’ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది. ఇక మెగాస్టార్ ‘ఆచార్య’లో సిద్ధగా ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్న చరణ్ సరసన జిగేల్ రాణి పూజా హెగ్డే ‘నీలాంబరి’గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని నిరంజన్‌రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

కొవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇవ్వగా.. ఇటీవల రామ్‌చరణ్‌, పూజా హెగ్డేపై కొన్ని సన్నివేశాలతో పాటు ‘నీలాంబరి’ అనే సాంగ్‌ను చిత్రీకరించారు. కాగా ఆ సాంగ్‌ను ఇంటర్నెట్‌లో లీకైంది. అయితే వెంటనే అప్రమత్తమైన మూవీ యూనిట్ ఈ లీకులను ఇంటర్నెట్ నుంచి తొలగించే పనిలో పడింది. ఇక ‘ఆచార్య’ సినిమా మే 13న విడుదలవుతుందని మేకర్స్ గతంలోనే ప్రకటించినా, ప్రస్తుత ఈ లీక్‌ వ్యవహారంతో ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed