- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకూ కరోనా వచ్చింది.. బాగానే ఉన్నాను
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మేయర్‌తో పాటు తనకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్లారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. అయితే ప్రతిఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చందర్ కోరారు. కేవలం తాను కనపడడం లేదని విమర్శించే వారి కోసమే తానీ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. తన […]</p>

X
దిశ, కరీంనగర్: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మేయర్‌తో పాటు తనకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్లారు.
ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. అయితే ప్రతిఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చందర్ కోరారు. కేవలం తాను కనపడడం లేదని విమర్శించే వారి కోసమే తానీ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు.
Next Story






