- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టా మధును విచారిస్తున్నాం : రామగుండం కమిషనరేట్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు తమ అదుపులోనే ఉన్నాడని రామగుండం కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారంరోజులుగా అదృశ్యం కావడానికి కారణాలు ఏంటన్న కోణంలో ఆరా తీస్తున్నామని వివరించారు. అడ్వకేట్స్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో ఇప్పటికే తాము పుట్ట మధును ప్రశ్నించామన్నారు. ఈ హత్య కేసులో వామన్ రావు తండ్రి ఇచ్చిన మరో ఫిర్యాదు మేరకు మరోసారి […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు తమ అదుపులోనే ఉన్నాడని రామగుండం కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారంరోజులుగా అదృశ్యం కావడానికి కారణాలు ఏంటన్న కోణంలో ఆరా తీస్తున్నామని వివరించారు. అడ్వకేట్స్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో ఇప్పటికే తాము పుట్ట మధును ప్రశ్నించామన్నారు. ఈ హత్య కేసులో వామన్ రావు తండ్రి ఇచ్చిన మరో ఫిర్యాదు మేరకు మరోసారి పుట్ట మధును ప్రశ్నిస్తున్నామని ప్రకటించారు.
కమిషనరేట్‌లోనే ఆరా..
పుట్టా మధును రామగుండం కమిషనరేట్‌లోని ఉన్నతాధికారుల సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా సమాచారం. హత్య కేసుతో పాటు గతంలో వచ్చిన పలు ఆరోపణలపై కూడా ఆయనపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 2018కి ముందు వచ్చిన ఆడియోల వ్యవహారంతో పాటు పలు విషయాల గురించి పోలీసు అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయంగా సమాచారం.






