- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పంచాయితీ.. నిండు ప్రాణం తీసిన నిందితుల అరెస్ట్
<p>దిశ, ఏపీ బ్యూరో: మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వెంట పడుతున్నాడు. పద్ధతి మార్చుకోవాలని యువకుడికి బాలిక బాబాయ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా వెంటపడుతుండటంతో విషయం కాస్త పెద్దమనుషుల దగ్గరకు వెళ్లింది. యువతి జోలికి రావొద్దని మైనర్ బాలిక బాబాయ్ పంచాయితీ చేశాడు. పంచాయితీ చేసిన బాలిక బాబాయ్‌ను సదరు యువకుడు దారుణంగా హత్య చేశాడు. విజయవాడ దుర్గా అగ్రహారంలో సంచలనం సృష్టించిన ఈ హత్యను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను […]</p>

దిశ, ఏపీ బ్యూరో: మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వెంట పడుతున్నాడు. పద్ధతి మార్చుకోవాలని యువకుడికి బాలిక బాబాయ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా వెంటపడుతుండటంతో విషయం కాస్త పెద్దమనుషుల దగ్గరకు వెళ్లింది. యువతి జోలికి రావొద్దని మైనర్ బాలిక బాబాయ్ పంచాయితీ చేశాడు. పంచాయితీ చేసిన బాలిక బాబాయ్‌ను సదరు యువకుడు దారుణంగా హత్య చేశాడు. విజయవాడ దుర్గా అగ్రహారంలో సంచలనం సృష్టించిన ఈ హత్యను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కండ్రిగకు చెందిన రామారావు సోదరుడి కుమార్తెను ఓ యువకుడు ప్రేమపేరుతో వేధించడంతో ఈనెల 16న పంచాయితీ జరిగింది. మైనర్ బాలిక జోలికి రావొద్దని యువతి బాబాయ్ రామారావు పంచాయితీలో తీర్పు వెల్లడించాడు.
అయితే రామారావుపై కోపం పెంచుకున్న యువకుడు కొరుకూరి రవీంద్ర చంపెస్తానని పలుమార్లు బెదిరించాడు. అయినప్పటికీ రామారావు బెదరలేదు. చివరకు ఆ రామారావు తనను ఎక్కడ చంపేస్తాడేమోనన్న భయంతో రవీంద్ర హత్యకు ప్లాన్ వేసినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కోతల శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్‌లతో కలిసి హత్య చేశాడు. సాంకేతిక ఆధారాలతో ఈ ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. తదుపరి విచారణలో ఇంకెవరైనా ఉన్నారా అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.






