రాంచరణ్ స్టోరీ, కేజీఎఫ్ హీరో.. వయా బోయపాటి

by  |
రాంచరణ్ స్టోరీ, కేజీఎఫ్ హీరో.. వయా బోయపాటి
X

దిశ, సినిమా : సుకుమార్ డైరెక్షన్‌లో ‘రంగస్థలం’ సినిమా తర్వాత రాంచరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘వినయ విధేయరామ’. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేయడంతో చెర్రీ, బోయపాటి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఆ ఫలితాన్ని పక్కనబెట్టి బోయపాటి బాలయ్యతో ‘అఖండ’ సినిమా చేస్తుండగా.. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్టు సమాచారం. కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యష్‌తో ఓ ప్రాజెక్ట్‌కు కమిట్ అయినట్టు తెలుస్తుండగా.. రాంచరణ్ స్టోరీతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

బోయపాటి-రాంచరణ్‌ కాంబినేషన్ పట్టాలెక్కే ముందు చెప్పిన స్టోరీని రాంచరణ్ రిజెక్ట్ చేయడంతో ‘వినయ విధేయ రామ’ కథ తెరపైకి వచ్చింది. కాగా బోయపాటి అప్పుడు చెర్రీ వద్దన్న స్టోరీతోనే ఇప్పుడు యష్‌ను ఒప్పించినట్లు టాక్. ఈ మేరకు తన నెరేషన్‌కు శాటిస్‌ఫై అయిన యష్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది. కాగా యష్ ప్రస్తుతం ‘కేజీఎఫ్2’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed