ఇటలీలో 'రెడ్' టీం

by  |
ఇటలీలో రెడ్ టీం
X

పూరి డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హీరో రామ్ చేస్తున్న చిత్రం ‘రెడ్’. తమిళ సినిమా ‘తడమ్’ రీమేక్‌గా వస్తున్న థ్రిల్లర్ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఓ వ్యక్తి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్‌ నిందితుడెవరో కనుక్కుంటాడు.. కానీ, నిందితుడు కూడా పోలీసు పోలికతోనే ఉండటాన్ని గుర్తించిన పోలీస్… తర్వాత ఏం చేస్తాడు? అసలు పోలీసుకు, నిందితుడికి మధ్య సంబంధం ఏంటి? అనేది కథ. రెడ్ సినిమాలో హీరోయిన్లుగా మాళవిక శర్మ, నివేదితా పేతురాజ్ నటిస్తుండగా.. సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇటలీలోని పలు లొకేషన్లలో రెండు సాంగ్స్‌ను షూట్ చేస్తున్న టీం.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. మూవీ ఏప్రిల్ 9న విడుదల కానుండగా.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ సినిమా నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా కిశోర్ తిరుమల – రామ్ కాంబినేషన్‌లో ఇప్పటికే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు రాగా ఇది మూడో సినిమా.



Next Story

Most Viewed