'జాను' ఈజ్ ద బెస్ట్ : రాంచరణ్

by  |
జాను ఈజ్ ద బెస్ట్ : రాంచరణ్
X

హీరో శర్వానంద్, సమంత అక్కినేనిల లేటెస్ట్ మూవీ జాను. ఫీల్ గుడ్‌లవ్ స్టోరీగా తెరకెక్కిన మూవీ తమిళ సినిమా 96 రీమేక్. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమికులరోజు కానుకగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఈ సినిమాను చూసిన మెగా పవర్‌స్టార్ రాంచరణ్.. చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.

ప్రేక్షకులను మెప్పించిన సినిమాను మళ్లీ రీమేక్ చేయడం సాహసంతో కూడుకున్న పనే అన్నాడు చెర్రీ. శర్వానంద్, సమంతలు హార్డ్ వర్క్ చేశారని.. 96 మూవీని మరిపించేలా యాక్ట్ చేశారని కొనియాడాడు. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న శర్వా, సామ్, దర్శకుడు ప్రేమ్ కుమార్, నిర్మాత దిల్ రాజులకు శుభాకాంక్షలు తెలిపాడు.

Next Story

Most Viewed