మీ మెరుపు స్టంపింగ్స్ మరిచిపోలేం : చరణ్

by  |
మీ మెరుపు స్టంపింగ్స్ మరిచిపోలేం : చరణ్
X

మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ అభిమానులకు కొండంత భరోసా. మ్యాచ్‌ గెలవాలంటే బాల్స్ తక్కువుండి.. చేయాల్సిన రన్స్ ఎక్కువున్నా సరే, క్రీజులో తనున్నాడంటే చాలు.. విక్టరీ పక్కా అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు మిస్టర్ కూల్. కానీ శనివారం మహి.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఏ క్రికెటర్‌కు అయినా రిటైర్మెంట్ తప్పదు కాబట్టి తన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు.

ఈ క్రమంలో ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అమేజింగ్ కెప్టెన్‌గా, మిస్టర్ కూల్‌గా పిలువబడిన మహికి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియా మొత్తం సమర్థవంతమైన వికెట్ కీపర్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు మీరొచ్చారు.. ఆడారు.. దేశం కోసం ప్రపంచాన్ని జయించారు. మీరు ఆడిన విన్నింగ్ ఇన్నింగ్స్.. మీరు చేసిన మెరుపు స్టంపింగ్స్ ఎప్పటికీ మరచిపోలేం’ అంటూ ధన్యవాదాలు తెలిపారు చెర్రీ.

Next Story

Most Viewed