ఆచార్యకు చెర్రీ ‘సిద్ధం’

by  |
ఆచార్యకు చెర్రీ ‘సిద్ధం’
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్‌రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాతగా ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టి చెర్రి, డైరెక్టర్ కొరటాలతో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్ వేసిన సెట్‌పై రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత చెర్రీకి కరోనా రాగా, ప్రస్తుతం ఆ మహామ్మారి నుంచి కోలుకుని ఆచార్య షూటింగ్‌లో ఈరోజు(ఆదివారం) పాల్గొనున్నాడు.

https://twitter.com/sivakoratala/status/1350661983444471809/photo/1

ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించగా, ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల ‘మా సిద్ధ సర్వం సిద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ చేస్తున్న పాత్ర పేరు ‘సిద్ధ’ కాగా, చెవికో పోగు, మెడలో రుద్రాక్షమాలతో చెర్రీ బ్యాక్ ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. చెర్రీ ఫొటో చూస్తుంటే కొరటాల చాలా పవర్‌ఫుల్ పాత్రలో మెగా పవర్‌ స్టార్‌ను చూపించనున్నట్లు తెలుస్తుంది. చిరు, చెర్రీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీలో ఉన్నారు. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా, చిరుకు జోడిగా బ్యూటీ డాళ్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ‘ఆచార్య’ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.


Next Story

Most Viewed