మెగాస్టార్‌కు మనవడిని ఎప్పుడిస్తావ్.. చెర్రీకి అభిమానుల ప్రశ్న

by  |
మెగాస్టార్‌కు మనవడిని ఎప్పుడిస్తావ్.. చెర్రీకి అభిమానుల ప్రశ్న
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 రెండు కూడా పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకుంటుండగా.. ఇటు ఓటీటీపై కూడా కాన్సంట్రేట్ చేశాడు చెర్రీ. బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్ ఖాన్ హిందీ వెర్షన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం కాగా.. ఈ మధ్య రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ క్రమంలో తెలుగు వెర్షన్‌లో హాట్‌స్టార్ అంబాసిడర్‌గా చెర్రీ నియామకమయ్యారని, ప్రోమోకు సంబంధించిన యాడ్ షూట్ జరుగుతోందని ట్విట్టర్ అప్‌డేట్ ద్వారా తెలుస్తోంది. అయితే అప్‌డేట్‌‌పై అదిరిపోయే స్టైల్ అంటూ రీట్వీట్ చేసి ఈ విషయాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన అభిమానులు.. అన్నా అంతా ఓకే కానీ చిరంజీవి గారికి మనవడిని ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నారు. కాగా రామ్ చరణ్ ఇప్పటికే పెప్పీ, హ్యాపీ మొబైల్స్, ఎయిర్ టెల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

https://twitter.com/AlwaysRamCharan/status/1438793815830106116?s=20


Next Story

Most Viewed