బాలయ్య సినిమా నుంచి తప్పుకున్న రామ్, లక్ష్మణ్

by  |
బాలయ్య సినిమా నుంచి తప్పుకున్న రామ్, లక్ష్మణ్
X

దిశ వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి అవ్వగా… ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా నుంచి ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి స్థానంలో ఫైట్ మాస్టర్ శివను తీసుకున్నట్లు సమాచారం.

బాయపాటి ప్రతి సినిమాకు రామ్, లక్ష్మణ్‌లు పనిచేస్తున్నారు. కానీ BB3 విషయంలో బోయపాటితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రామ్, లక్ష్మణ్‌లు ఇప్పటికే కొన్ని ఫైట్ సీన్లను తెరకెక్కించారు. ఇప్పుడు తప్పుకోవడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడనుంది.

కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.


Next Story

Most Viewed