హాట్ టాపిక్.. కండోమ్ టెస్టర్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో రచ్చ

by  |
హాట్ టాపిక్.. కండోమ్ టెస్టర్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్ : నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఈ తరుణంలో డిఫరెంట్ పాత్రలు చేసేందుకు రెడీ అవుతోంది బ్యూటిఫుల్ భామ. ఓ వైపు గ్లామర్ పాత్రలను పోషిస్తూనే వెరైటీ పాత్రలను సైతం ఎంచుకుంటోంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ఛాత్రివలీ’.. ఇందులో రకుల్ కండోమ్‌ టెస్టర్‌గా నటిస్తోంది.

ఈ సందర్భంగా.. నాకు ఎంతో నచ్చి, నమ్మి చేస్తున్న సినిమా ‘ఛాత్రివలీ’.. ఈ సినిమా ప్రయాణం చాలా హాయిగా సాగుతోంది అని రకుల్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో కామెంట్స్ చేసింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. తేజస్‌ ప్రభ విజయ్‌ దర్శకత్వం వహించగా డియోస్కర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆమె కండోమ్స్‌ని ఎలా టెస్ట్ చేస్తుంది.. అన్నదే ఇప్పుడు సొషల్ మీడియాలో ఆసక్తికర చర్చగా మారింది.

కాగా.. కొన్ని కంపెనీలు కండోమ్స్‌ను మార్కెట్‌లో అమ్ముతాయి. కంపెనీలు తమ ఉత్పత్తులను విడుదల చేసే ముందు వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ చేయడానికి వాళ్ళు కండోమ్ టెస్టర్స్‌తో పరీక్షిస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా కొంత మందిని వాళ్ళు నియమించుకుంటారు. వారు ఈ కండోమ్స్‌ని వాడేటప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా, సౌకర్యవంతంగా ఉన్నాయా లేక ఏవైనా మార్పులు చేయాల అనే దానిపై ఫీడ్ బ్యాక్ ఇస్తారు.. ఇలా టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది.

Next Story

Most Viewed