అందం కాదు ఆరోగ్యం కోసమే : రకుల్

by  |
అందం కాదు ఆరోగ్యం కోసమే : రకుల్
X

దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ జిమ్‌లో కసరత్తులు చేస్తూనే ఉంటుంది. అందంగా, నాజూగ్గా కనిపించేందుకే ఇంత కష్టపడుతుందేమో అనుకుంటాం. కానీ.. అందం కోసం కాదు ఆరోగ్యం కోసమే తను వర్కౌట్ చేస్తున్నానని చెబుతుంది రకుల్. రోజుకు అర్ధగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని .. అలాంటప్పుడు బద్ధకం ఎందుకు చెమటోడ్చాలని సూచిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఆటల్లో ముందుండేదాన్ని అని చెప్తున్న రకుల్… అప్పటి నుంచే వర్కౌట్ చేయడం అలవాటు అయిందని చెప్తుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఎన్నో ప్రాంతాలు తిరగాల్సి వస్తుందని… అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలంటే వర్కౌట్ తప్పనిసరని చెప్తోంది. మీరు కూడా ట్రై చేస్తే ఆరోగ్యంగా ఉంటారని సలహాలిస్తోంది రకుల్. కాగా రకుల్‌ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. అవకాశాలు లేక ఖాళీగా ఉంటోందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags: Rakul Preet Singh, Gym, Workout, Health, Fitness

Next Story

Most Viewed