డ్రగ్స్ కేసులో తెరపైకి ‘రకుల్’ పేరు..

by  |
డ్రగ్స్ కేసులో తెరపైకి ‘రకుల్’ పేరు..
X

దిశ వెబ్ డెస్క్: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి ఎన్ సీబీ అధికారుల ముందు పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఈమెతో పాటు పలువురు తెలుగు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. రియా ఫోన్ కాల్ డేటాలో పలువురు హీరో, హీరోయిన్ల నెంబర్లు ఉన్నట్టు సమాచారం. ఇక ఈ కేసులో నటి సారా అలీఖాన్ తో పాటు డిజైనర్ సిమోన్ ఖంబట్టా, ఇంక కొందరు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా రియా 25 మంది పేర్లను వెల్లడించిందని తెలుస్తోంది. వారందరి పేర్లతో అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులపై అధికారులు నిఘా పెట్టినట్టు సమాచారం..

Read Also…

హై రేంజ్‌ VFX‌తో ప్రభాస్ ‘ఆదిపురుష్’



Next Story

Most Viewed