కండోమ్ టెస్ట్‌ కోసం ఆ హీరోయిన్ సెక్స్‌‌లో పాల్గొంటుందా?

by  |
కండోమ్ టెస్ట్‌ కోసం ఆ హీరోయిన్ సెక్స్‌‌లో పాల్గొంటుందా?
X

దిశ, సినిమా : అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. జనరేషన్‌తో పాటు అప్‌డేట్ అవుతూ.. బోల్డ్ క్యారెక్టర్‌ను ఓకే చేసేసింది. ఈ క్రమంలో ఏకంగా కండోమ్ టెస్టర్‌గా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సోషల్ డ్రామా డైరెక్ట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుండగా.. ఇందులో రకుల్ సెక్సిక్యూటివ్‌గా కనిపించనుంది. సాధారణంగా కండోమ్స్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసే ముందు తయారీ కంపెనీలు, వాటిని పరీక్షించేందుకు కండోమ్ టెస్టర్స్‌ను నియమిస్తుంటాయి. టెస్టింగ్‌లో భాగంగా వీరు కంపెనీ నిబంధనల ప్రకారం కొంత కాలం శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది.

కాగా, తేజాస్ డియోస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అలాంటి బోల్డ్ క్యారెక్టర్‌ కోసం ముందుగా సారా అలీ ఖాన్, అనన్య పాండేలను సంప్రదించగా.. కాన్సెప్ట్ చాలా బోల్డ్‌గా ఉందని నో చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత ఇదే కథ రకుల్ దగ్గరికి చేరగా.. వెంటనే పచ్చజెండా ఊపేసిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కమర్షియల్ రోల్స్ మాత్రమే ప్లే చేస్తూ వస్తున్న రకుల్.. ఈ యూనిక్ క్యారెక్టర్‌‌తో ఆడియన్స్ ఇంప్రెషన్ కొట్టేయనుందని చెప్తున్న మేకర్స్.. సారా, అనన్య నో చెప్పడం రకుల్‌కు ప్రాఫిట్ అవుతుందని అంటున్నారు.


Next Story

Most Viewed